Welcome to Telugu E-News Paper web site / for more updates visit daily @ www.teluguenewspaper.blogspot.com

Important Days

జాతీయ దినోత్సవాలు:-

  • జనవరి 9: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మనదేశాభివృద్ధిలో తోడ్పాటుకు గుర్తుగా ప్రతి ఏటా జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్‌గా పరిగణిస్తారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి జనవరి 9, 1915న భారతదేశానికి తిరిగి వచ్చారు. అందువల్ల జనవరి 9ని ఎన్‌ఆర్‌ఐ డేగా జరుపుకొంటారు. 2003 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 11వ ప్రవాసీ భారతీయ దివస్‌ను ఈ ఏడాది జనవరి 7, 9 తేదీల్లో కేరళలోని కొచ్చిలో నిర్వహించారు. మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్‌యాగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును బహూకరించారు.

  • జనవరి 12: స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటారు. 1985 నుంచి దీన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను జరుపుకొన్నారు.

  • జనవరి 25: 2011 నుంచి జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో యువకులు ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. జనవరి 25, 2013 నాటికి భారతదేశంలో ఓటర్ల సంఖ్య 77.78 కోట్లు. ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం ఒలింపిక్ పతక విజేతలైన సైనా నెహ్వాల్, మేరీకామ్‌లను ప్రతినిధులుగా నియమించింది.

  • ఫిబ్రవరి 28: సర్ సి.వి.రామన్.. రామన్ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28, 1928న కనుగొన్నారు. ఆ కారణంగా ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్‌‌స దినోత్సవంగా నిర్వహిస్తారు. రామన్‌కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 2013 సైన్‌‌స దినం ప్రధాన అంశం- ‘జన్యుమార్పిడి పంటలు, ఆహార భద్రత’.

  • మే 11: భారతదేశం మే 11, 1998లో రెండో అణ్వస్త్ర పరీక్షలను రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించింది. దీన్నే పోఖ్రాన్-2 లేదా ఆపరేషన్ శక్తి అంటారు. అందువల్ల మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినం (టెక్నాలజీ డే)గా జరుపుకొంటాం. మొదటి అణు పరీక్షలను 1974లో నిర్వహించారు.

  • జూలై 1: ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గౌరవార్థం జూలై 1ని వైద్యుల దినోత్సవం (డాక్టర్‌‌స డే)గా జరుపుకొంటారు. డాక్టర్ బి.సి.రాయ్ పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి. ఆయనకు 1961లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆయన జూలై 1, 1882న జన్మించారు. 1962లో జూలై ఒకటో తేదీనే మరణించారు. మన జీవితాల్లో వైద్యులు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తారో తెలియచేయడానికి జూలై ఒకటో తేదీని వైద్యుల దినంగా పాటిస్తాం.

  • ఆగస్టు 29: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టిన రోజైన ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినంగా పరిగణిస్తారు. ధ్యాన్‌చంద్ అద్భుత ప్రతిభ వల్ల మనదేశానికి 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లలో బంగారు పతకాలు లభించాయి. ప్రజల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర, అర్జున, ద్రోణాచార్య మొదలైన క్రీడా అవార్డులను ఆగస్టు 29న ప్రదానం చేస్తారు.

  • సెప్టెంబర్ 15: ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15వ తేదీని ఇంజనీర్‌‌స డే నిర్వహిస్తారు. ఆయన సెప్టెంబర్ 15, 1860లో జన్మించారు. విశ్వేశ్వరయ్యకు 1955లో భారతరత్న లభించింది.

  • నవంబర్ 11: భారతదేశ మొదటి విద్యామంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి అయిన నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యాదినంగా పాటిస్తారు. ఆయనకు 1992లో మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు.

  • డిసెంబర్ 22: భారత గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887న జన్మించారు. ఆయన జయంతిని భారత ప్రభుత్వం జాతీయ గణితశాస్త్ర దినంగా ప్రకటించింది. 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా పాటించారు.

  • డిసెంబర్ 23: భారతదేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ డిసెంబర్ 23, 1902న జన్మించారు. ఆయన జయంతిని కిసాన్ దివస్ లేదా వ్యవసాయదారుల దినోత్సవంగా నిర్వహిస్తారు. మనదేశంలోని రైతుల అభివృద్ధికి చరణ్‌సింగ్ నిరంతరం కృషి చేశారు. 

మరికొన్ని జాతీయ దినోత్సవాలు:-
  • జనవరి 15 సైనిక దినోత్సవం
  • జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం
  • జనవరి 25 జాతీయ పర్యాటక దినం
  • జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినం
  • ఫిబ్రవరి 2 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినం
  • ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినం
  • మార్చి 3 జాతీయ రక్షణ దినం
  • మార్చి 4 జాతీయ భద్రతా దినం
  • ఏప్రిల్ 5 జాతీయ మారిటైమ్ దినం
  • ఏప్రిల్ 11 జాతీయ జననీ సురక్షా దినం
  • ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ దినం
  • ఏపిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినం
  • మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం 
  • (రాజీవ్‌గాంధీ వర్ధంతి)
  • జూలై 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దినం
  • జూలై 26 కార్గిల్ విజయ్ దివస్
  • ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినం
  • ఆగస్ట్ 20 జాతీయ సద్భావనా దినం 
  • (రాజీవ్‌గాంధీ జయంతి)
  • సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం 
  • సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం
  • అక్టోబర్ 8 భారత వైమానిక దినం
  • అక్టోబర్ 10 జాతీయ తపాలా దినం
  • నవంబర్ 14 బాలల దినోత్సవం
  • డిసెంబర్ 4 నావికాదళ దినం
  • డిసెంబర్ 7 ఆర్‌‌మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే
  • డిసెంబర్ 14 జాతీయ శక్తి సంరక్షణ దినం
  • డిసెంబర్ 18 మైనారిటీల హక్కుల దినం

Post a Comment

0 Comments